న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి క‌ళానిధి అవార్డు బ‌హుక‌ర‌ణ‌

updated: May 29, 2018 14:13 IST
న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి క‌ళానిధి అవార్డు బ‌హుక‌ర‌ణ‌

మైసూరు ద‌త్త పీఠంలో స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డా.రాజేంద్ర ప్ర‌సాద్‌గారికి క‌ళానిధి అవార్డుని అందించారు. 

నాలుగు ద‌శాబ్దాలు పైగా హీరోగా, కామెడీ స్టార్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న న‌టుడు డా.రాజేంద్ర ప్ర‌సాద్‌. ఈయ‌న‌కు క‌ళానిధి అవార్డును బ‌హూక‌రించిన అనంతంరం..

ఈ సంద‌ర్భంగా గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి మాట్లాడుతూ - ``నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. హాస్యానికి కిరిటాన్ని పెట్టిన న‌ట‌కిరీటికి ఈ క‌ళానిధి అవార్డు ఇవ్వ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు. 
డా.రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``నాలుగు ద‌శాబ్దాలుగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లతో తెలుగు ప్రేక్షక్ష‌కుల‌ను మెప్పించాను. న‌టుడిగా ఎన్నో అవార్డుల‌ను అందుకున్న‌ప్ప‌టికీ  స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా క‌ళానిధి అవార్డును స్వీక‌రించ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: rajendr prasad, nata kiriti, kalanidhi award, ganapathi sachinanda swamy

comments