మన తెలిగింటి ఆణిముత్యం..మాగంటి జాహ్నవి

updated: April 3, 2018 13:31 IST
మన తెలిగింటి ఆణిముత్యం..మాగంటి జాహ్నవి

మనందరికీ చిన్ననాటి నుంచీ ఎన్నో సరదాలు, ఇష్టాలు, హాబీలు ఉంటూంటాయి  కానీ వయసు పెరిగేకొద్ది రొటీన్ లైఫ్ లో పడి..చదువు అనే పోటీలో ప్రవేశించి, ఆ పరుగులో రోజులు గడిపేస్తూంటే...అవన్ని  మెల్లి మెల్లిగా మరుగున పడిపోతుంటాయి. వాటిపై ఇంట్రస్ట్  కూడా క్రమేణా తగ్గిపోతూవుంటుంది. అందుకే చాలా మందిని ..అరే..చిన్నప్పుడు ఎంత చక్కగా బొమ్మలు గీసేది, పాటలు పాడేది, డాన్స్ చేసేది అని గుర్తు చేసుకుంటూంటాం. పెద్దయ్యాక అవేమీ వారిలో కనిపించక నిట్టూరుస్తూంటాం. 

కానీ చిన్నతనంలో  ఏర్పడిన ఆసక్తిని విడిచిపెట్టకుండా , ఆ స్కిల్ ని డవలప్ చేసుకుంటూ, ఈ రోజున ప్రపంచం అంతా మెచ్చుకునేలా గుర్తింపుతెచ్చుకోవటం అంటే మాటలు కాదు.  హాబీగా మొదలైన కళకు, మెరుగులు దిద్ది, తమదైన సృజనాత్మకతను జోడించి పలువురి మన్ననలను పొందుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది... మన తెలిగింటి అమ్మాయి జాహ్నవి మాగంటి .

ఏమిటి జాహ్నవి గొప్పతనం అంటే...  కాలితో వేసిన పెయింటింగుల్లో జాహ్నవి వేసిన పెయింటింగ్ అతి పెద్దది కావడం గమనార్హం.దీంతో ఆమె పెయింటింగ్ గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. సాధారణంగా అంతా  చేతులతో పెయింటింగ్ వేస్తుంటారు. కానీ, దానికి భిన్నంగా కాలితో పెయింటింగ్ వేయడం ఆమె ప్రత్యేకత అయితే గిన్నీస్ రికార్డ్ సృష్టించటం ఆమె ఘనత.  

హైదరాబాద్‌ ల్యాంక్‌ హిల్స్‌ టెన్సిస్‌ కోర్టులో 140 చదరపు అడుగుల స్థలంలో మూడు గులాబీ పువ్వులు, మూడు ఆకులు, పచ్చదనంతో కూడిన భారీ పెయింటింగ్‌ వేసి జాహ్నవి గిన్నిస్‌ రికార్డు సాధించారు.

 గతంలో 100 చదరపు అడుగుల కాలి పెయింటింగ్ రికార్డు. కానీ, జాహ్నవి ఈ రికార్డును తిరగరాసింది. జాహ్నవి ...140 చ‌ద‌ర‌పు అడుగుల పెయింటింగ్ వేసి ప్ర‌పంచ రికార్డుకెక్కింది. కాలి వేళ్ల మ‌ధ్య పెయింటింగ్ బ్ర‌ష్ ప‌ట్టుకుని, చాలా సునాయాసంగా పెయింటింగ్‌ని పూర్తి చేసింది. 
పెయింటింగ్ తో పాటు . న‌ట‌న‌, డ్యాన్సింగ్‌,పాటలు పాడడం వంటి క‌ళ‌ల్లో కూడా జాహ్న‌వికి ప్రావీణ్యం ఉంది. ఆమె కాలేజీ స్థాయిలో బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ కూడా.ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లోని వేర్విక్ యూనివ‌ర్సిటీలో ఎక‌నామిక్స్‌, ఇండ‌స్ట్రీ ఆర్గ‌నైజేష‌న్‌లో జాహ్న‌వి గ్రాడ్యుయేష‌న్ కోర్స్  చేస్తోంది. 

రీసెంట్ గా మాగంటి జాహ్నవిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అభినందించారు. తన తల్లిదండ్రులతో కలిసి ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు జాహ్నవికి శాలువా కప్పి జ్ఞాపిక అందజేశారు.చదవు తర్వాత భారత్‌లో సేవలందించేందుకు ప్రాధాన్యమివ్వాలని, జన్మభూమి గుర్తింపు తీసుకువారాలని ముఖ్యమంత్రి సూచించారు. 

ఆమె మరిన్నో విజయాలు సాధించాలని, రికార్డ్ లు క్రియేట్ చేయాలని ఆశిస్తూ... తెలుగు 100 శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

comments